View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

శ్రీ లలితా చాలీసా

లలితామాతా శమ్భుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమన్తటికీ ఆధారమ్ ॥ 1 ॥

హేరమ్బునికి మాతవుగా హరిహరాదులు సేవిమ్ప
చణ్డునిముణ్డుని సంహారం చాముణ్డేశ్వరి అవతారమ్ ॥ 2 ॥

పద్మరేకుల కాన్తులలో బాలాత్రిపురసున్దరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ 3 ॥

శ్వేతవస్త్రము ధరియిఞ్చి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నిమ్పితివి ॥ 4 ॥

నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుణ్డ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ॥ 5 ॥

కదమ్బవన సఞ్చారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కఞ్చి కామాక్షివైనావు ॥ 6 ॥

శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసున్దరిగా
సిరి సమ్పదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగా రావమ్మా ॥ 7 ॥

మణిద్వీపమున కొలువుణ్డి మహాకాళి అవతారములో
మహిషాసురుని చమ్పితివి ముల్లోకాలను ఏలితివి ॥ 8 ॥

పసిడి వెన్నెల కాన్తులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి ॥ 9 ॥

రక్తవస్త్రము ధరియిఞ్చి రణరఙ్గమున ప్రవేశిఞ్చి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు ॥ 10 ॥

కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణిఞ్చి
కలియుగమన్తా కాపాడ కనకదుర్గవై వెలిసితివి ॥ 11 ॥

రామలిఙ్గేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమా వాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ॥ 12 ॥

ఖడ్గం శూలం ధరియిఞ్చి పాశుపతాస్త్రము చేబూని
శుమ్భ నిశుమ్భుల దునుమాడి వచ్చిన్ది శ్రీశ్యామలగా ॥ 13 ॥

మహామన్త్రాధిదేవతగా లలితాత్రిపురసున్దరిగా
దరిద్ర బాధలు తొలిగిఞ్చి మహదానన్దము కలిగిఞ్చే ॥ 14 ॥

అర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశఙ్కర పూజితవే అపర్ణాదేవి రావమ్మా ॥ 15 ॥

విష్ణు పాదమున జనియిఞ్చి గఙ్గావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి ॥ 16 ॥

ఆశుతోషుని మెప్పిఞ్చి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదమ్బా ॥ 17 ॥

దక్షుని ఇణ్ట జనియిఞ్చి సతీదేవిగా చాలిఞ్చి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదమ్బా ॥ 18 ॥

శఙ్ఖు చక్రము ధరియిఞ్చి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు ॥ 19 ॥

పరాభట్టారిక దేవతగా పరమశాన్త స్వరూపిణిగా
చిరునవ్వులను చిన్దిస్తూ చెఋకు గడను ధరయిఞ్చితివి ॥ 20 ॥

పఞ్చదశాక్షరి మన్త్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుణ్డ కైలాసమ్బే పులకిఞ్చే ॥ 21 ॥

సురులు అసురులు అన్దరును శిరసును వఞ్చి మ్రొక్కఙ్గా
మాణిక్యాల కాన్తులతో నీ పాదములు మెరిసినవి ॥ 22 ॥

మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అఙ్కుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదమ్బా ॥ 23 ॥

సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొన్ది
శఙ్ఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి ॥ 24 ॥

మహామేరువు నిలయినివి మన్దార కుసుమ మాలలతో
మునులన్దరు నిను కొలవఙ్గ మోక్షమార్గము చూపితివి ॥ 25 ॥

చిదమ్బరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిన్దిఞ్చే ॥ 26 ॥

అమ్బా శామ్భవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసున్దరము నీ రూపమ్ ॥ 27 ॥

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునన్దరికివ్వమ్మా ॥ 28 ॥

నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు ॥ 29 ॥

రాక్షస బాధలు పడలేక దేవతలన్తా ప్రార్థిమ్ప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి ॥ 30 ॥

అరుణారుణపు కాన్తులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనన్దరి దునుమాడి అపరాజితవై వచ్చితివి ॥ 31 ॥

గిరిరాజునికి పుత్రికగా నన్దనన్దుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి ॥ 32 ॥

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమన్తటికీ మాతవుగా
అన్దరి సేవలు అన్దుకొని అన్తట నీవే నిణ్డితివి ॥ 33 ॥

కరుణిఞ్చమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దర్శనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ॥ 34 ॥

ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు ॥ 35 ॥

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమన్తా చేరితిమి నీ పారాయణ చేసితిమి ॥ 36 ॥

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కిఞ్చుట మా తరమవునా ॥ 37 ॥

ఆశ్రితులన్దరు రారణ్డి అమ్మరూపము చూడణ్డి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొన్దుదము ॥ 38 ॥

సదాచార సమ్పన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుమ్బినివి సౌభాగ్యమిచ్చే దేవతవు ॥ 39 ॥

మఙ్గళగౌరీ రూపమును మనసుల నిణ్డా నిమ్పణ్డి
మహాదేవికి మనమన్తా మఙ్గళ హారతులిద్దాము ॥ 40 ॥




Browse Related Categories: