శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాన్ధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమఙ్గమ్మకూ (1)
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియిఞ్చియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మఙ్గమ్మకూ (2)
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
ఆనన్ద నిలయమన్దనిశమ్బు వసియిఞ్చి దీనులను రక్షిఞ్చు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానిఞ్చు అలమేలు మఙ్గమ్మకూ (3)
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
పరమొసగ నా వన్తు నరులకని వైకుణ్ఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వన్తు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగిఞ్చి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకమ్బు జేయిఞ్చి అన్దరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం
జయ మఙ్గళం నిత్య శుభమఙ్గళం