View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ


రాగమ్: పాడి / పహాడి (29 ధీర శన్కరాభరణం జన్య)/మోహన
ఆ: స రి2 గ3 ప ద2 స
అవ: స ద2 ప గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥

చరణం 1
సిరులసిఙ్గారరాయ చెలువపుతిమ్మరాయ ।
సరసవైభవరాయ సకలవినోదరాయ । (2)
వరవసన్తములరాయ వనితలవిటరాయ । (2)
గురుతైన తేగరాయ కొణ్డలకోనేటిరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..)

చరణం 2
గొల్లెతలవుద్దణ్డరాయ గోపాలకృష్ణరాయ ।
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ । (2)
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ । (2)
కొల్లలైన భోగరాయ కొణ్డలకోనేటిరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..)

చరణం 3
సామసఙ్గీతరాయ సర్వమోహనరాయ ।
ధామవైకుణ్ఠరాయ దైత్యవిభాళరాయ । (2)
కామిఞ్చి నిన్ను గోరితే గరుణిఞ్చితివి నన్ను । (2)
శ్రీమన్తుడ నీకు జయ శ్రీవేఙ్కటరాయ ॥ (2)
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥




Browse Related Categories: