PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: రామదాసు
పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష
Read Related Stotrams:
- రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా
- రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో
- త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె
- త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు
- రామ రక్షా స్తోత్రమ్

