View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచన్ద్రా
నన్ను రక్షిమ్ప కున్నను రక్షకు లెవరిఙ్క రామచన్ద్రా

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచన్ద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచన్ద్రా

శత్రుఘ్నునకు చేయిస్తి బఙ్గారు మొలతాడు రామచన్ద్రా
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచన్ద్రా

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచన్ద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచన్ద్రా

సీతమ్మకు చేయిస్తి చిన్తాకు పతకము రామచన్ద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచన్ద్రా

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచన్ద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచన్ద్రా

నీ తణ్డ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచన్ద్రా
లేక నీ మామ జనక మహరాజు పమ్పెనా రామచన్ద్రా

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచన్ద్రా
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచన్ద్రా

భక్తులన్దరిని పరిపాలిఞ్చెడి శ్రీ రామచన్ద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచన్ద్రా




Browse Related Categories: