PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరా
కటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ||
ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురా
అందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ||
మతసమైక్యతా నినాదమే మనకు బలమురా
గతచరిత్ర తలచి జగద్హితము నేడు కనుమురా ||
ఉదయోజ్వల భాస్కర కిరణోదంచితమురా నభం
భువన మానవాభ్యుదయ విజయమదే మనకు శుభమ్ ||

