PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ||
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ||
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ||
Read Related Stotrams:
- అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో
- అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో
- అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న
- అన్నమయ్య కీర్తన తందనానా అహి
- శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్

