అన్నమయ్య కీర్తన వినరో భాగ్యము
వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ ॥
ఆది నుణ్డి సన్ధ్యాది విధులలో వేదమ్బయినది విష్ణుకథ । నాదిఞ్చీనిదె నారదాదులచే వీథి వీథులనే విష్ణుకథ ।
వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణుకథ । సదనమ్బైనది సఙ్కీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ ॥
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లి విరియాయె విష్ణుకథ । ఇల్లిదె శ్రీ వేఙ్కటేశ్వరు నామము వెల్లగొలిపె నీ విష్ణుకథ ॥
Browse Related Categories: