View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన త్వమేవ శరణమ్

త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥

వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా ।
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుఞ్జరవరద ।
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ॥

వటపత్రశయన భువనపాలన జన్తు- ఘటకారకరణ శృఙ్గారాధిపా ।
పటుతర నిత్యవైభవరాయ తిరువేఙ్కటగిరినిలయ జగన్నాథా ॥




Browse Related Categories: