View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మిఞ్చిన సిఙ్గారములతోడను ॥

తిరుదణ్డేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెణ్డవనాడు శేషునిమీద ।
మురిపేన మూడోనాడు ముత్యాల పన్దిరి క్రిన్ద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ॥

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ॥
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుర్రమెనిమిదోనాడు ॥

కనకపుటన్దలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెణ్డ్లిపీట ।
యెనసి శ్రీ వేఙ్కటేశు డిన్తి యలమేల్​మఙ్గతో
వనితల నడుమను వాహనాలమీదను ॥




Browse Related Categories: