View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ।
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥

సిరులసిఙ్గారరాయ చెలువపుతిమ్మరాయ ।
సరసవైభవరాయ సకలవినోదరాయ ।
వరవసన్తములరాయ వనితలవిటరాయ ।
గురుతైన తేగరాయ కొణ్డలకోనేటిరాయ ॥

గొల్లెతలవుద్దణ్డరాయ గోపాలకృష్ణరాయ ।
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ ।
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ ।
కొల్లలైన భోగరాయ కొణ్డలకోనేటిరాయ ॥

సామసఙ్గీతరాయ సర్వమోహనరాయ ।
ధామవైకుణ్ఠరాయ దైత్యవిభాళరాయ ।
కామిఞ్చి నిన్ను గోరితే గరుణిఞ్చితివి నన్ను ।
శ్రీమన్తుడ నీకు జయ శ్రీవేఙ్కటరాయ ॥




Browse Related Categories: