View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన సర్వాన్తరాత్ముడవు

సర్వాన్తరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥

వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతన్త్రమిచ్చి ।
కోరేటియపరాధాలు కొన్ని వేసి ।
నేరకుణ్టే నరకము నేరిచితే స్వర్గమణ్టూ ।
దూరువేసేవిన్తేకాక దోషమెవ్వరిదయ్యా ॥

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి ।
జనులకు విషయాలు చవులుచూపి ।
కనుగొణ్టే మోక్షమిచ్చి కానకుణ్టె కర్మమిచ్చి ।
ఘనము సేసేవిన్దు కర్తలెవ్వరయ్యా ॥

వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే ।
కన్నకన్న భ్రమతలే కల్పిఞ్చి ।
యిన్నిటా శ్రీవేఙ్కటేశ యేలితివి మమ్ము నిట్టె ।
నిన్ను నన్ను నెఞ్చుకుణ్టే నీకే తెలియునయ్యా ॥




Browse Related Categories: