View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు

రాగం: కానడ

రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥

అరయ పుత్రకామేష్టి యన్దు పరమాన్నమున ।
పరగ జనిఞ్చిన పర బ్రహ్మము ।
సురల రక్షిమ్పగ అసురుల శిక్షిమ్పగ ।
తిరమై ఉదయిఞ్చిన దివ్య తేజము ॥

చిన్తిఞ్చే యోగీన్ద్రుల చిత్త సరోజములలో ।
సన్తతము నిలిచిన సాకారము ।
విన్తలుగా మునులెల్ల వెదకిన యట్టి ।
కాన్తుల చెన్ను మీరిన కైవల్య పదము ॥

వేద వేదాన్తములయన్దు విజ్ఞాన శాస్త్రములన్దు ।
పాదుకొన పలికేటి పరమార్ధము ।
ప్రోదితొ శ్రీ వేఙ్కటాద్రి పొఞ్చి విజయ నగరాన ।
ఆదికి అనాదియైన అర్చావతారము ॥




Browse Related Categories: