View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన పిడికిట తలమ్బ్రాల

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త ।
పడమరలి నవ్వీనె పెణ్డ్లి కూతురు ॥

పేరుకల జవరాలె పెణ్డ్లి కూతురు పెద్ద ।
పేరుల ముత్యాల మేడ పెణ్డ్లి కూతురు ।
పేరణ్టాణ్డ్ల నడిమి పెణ్డ్లి కూతురు విభు ।
పేరుకుచ్చు సిగ్గువడీ బెణ్డ్లి కూతురు ॥

బిరుదు పెణ్డము వెట్టె బెణ్డ్లి కూతురు నెర ।
బిరుదు మగని కణ్టె బెణ్డ్లి కూతురు ।
పిరిదూరి నప్పుడే పెణ్డ్లి కూతురూ పతి ।
బెరరేచీ నిదివో పెణ్డ్లి కూతురు ॥

పెట్టెనే పెద్ద తురుము పెణ్డ్లి కూతురు నేడె ।
పెట్టెడు చీరలు గట్టి పెణ్డ్లి కూతురు ।
గట్టిగ వేఙ్కటపతి కౌగిటను ।
పెట్టిన నిధానమయిన పెణ్డ్లి కూతురు ॥




Browse Related Categories: