PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
రాగం: ఖరహరప్రియ
పెద తిరుమలాచర్యుల రచన
ఒకపరి కొకపరి కొయ్యారమై |
మొకమున కళలెల్ల మొలచినట్లుండె ||
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి |
జిగికొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన |
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె ||
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు |
కరగి ఇరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహమదము |
తొరిగి సామజసిరి తొలికినట్లుండె ||
మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను |
తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగు బోడి అలమేలు మంగయు తాను |
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె ||

