View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన నానాటి బతుకు

రాగం: ముఖారి

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ॥

పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము ।
యెట్టనెదుటి కలదీ ప్రపఞ్చము
కట్ట గడపటిది కైవల్యము ॥

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమన్త్రపు పని నాటకము ।
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ॥

తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము ।
ఎగువనే శ్రీ వేఙ్కటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ॥




Browse Related Categories: