మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ॥
కన్దులేని మోమున కేలే కస్తూరి
చిన్దు నీ కొప్పున కేలే చేమన్తులు ।
మన్దయానమున కేలే మట్టెల మోతలు
గన్ధమేలే పైపై కమ్మని నీ మేనికి ॥
భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము ।
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరణ్ట గోళ్ళ కేలే కొనవాణ్డ్లు ॥
ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి ।
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేఙ్కటాద్రీశు గూడి ॥