PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల |
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ||
సందడిచే గోపికల జవ్వనవనములోన |
కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని |
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ||
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో |
రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల- |
కితమై పొడిమిన నా యిందు బింబమ ||
వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై |
నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద |
గరిమ వరాలిచ్చే కల్పతరువా ||

