PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా |
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ||
తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా |
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ||
ఘనదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా |
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ||
వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయుదోషరహిత మేలుకోవయ్యా |
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ||

