అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి
మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ॥
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన ॥
అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటు తానై । అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి అందరాని పద మందెనటుగాన ॥
Browse Related Categories: