అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి
మనుజుడై పుట్టి మనుజుని సేవిఞ్చి అనుదినమును దుఃఖమన్దనేలా ॥
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లమ్పటము వదలనేరడుగాన ॥
అన్దరిలో పుట్టి అన్దరిలో చేరి అన్దరి రూపములటు తానై । అన్దమైన శ్రీ వేఙ్కటాద్రీశు సేవిఞ్చి అన్దరాని పద మన్దెనటుగాన ॥
Browse Related Categories: