View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కులుకుగ నడవరో

రాగం: దేసాళం

కులుకక నడవరో కొమ్మలాలా ।
జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాన్తులాలా ।
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరిఞ్చె మా యమ్మకు నెన్నుదురు ॥

చల్లెడి గన్దవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల ।
మొల్లమైన కున్దనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గఙ్కణాలు గదలీమాయమ్మకు ॥

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో ।
అమరిఞ్చి కౌగిట నలమేలు మఙ్గనిదె
సమకూడె వేఙ్కటేశ్వరుడు మా యమ్మకు ॥




Browse Related Categories: