PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
కొలిచిన వారల కొంగుపైడితడు |
బలిమి తారక బ్రహ్మమీతడు ||
ఇనవంశాంబుధి నెగసిన తేజము |
ఘనయఙ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము |
నినువుల రఘుకుల నిధానమీతడు ||
పరమాన్నములోపలి సారపుజవి |
పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము |
ధరలో రామావతారంబితడు ||
చకితదానవుల సంహారచక్రము |
సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము |
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||

