View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన కంటి శుక్రవారము

కంటి శుక్రవారము గడియ లేడింట ।
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥

సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి ।
కమ్మని కదంబము కప్పు కన్నీరు ।
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి ।
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥

పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి ।
తెచ్చి శిరసాదిగ దిగనలది ।
అచ్చెరపడి చూడనందరి కనులకింపై ।
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ॥

తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు ।
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి ।
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది ।
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ॥




Browse Related Categories: