View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కణ్టి నఖిలాణ్డ

కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి ।
కణ్టి నఘములు వీడుకొణ్టి నిజమూర్తి గణ్టి ॥

మహనీయ ఘన ఫణామణుల శైలము గణ్టి ।
బహు విభవముల మణ్టపములు గణ్టి ।
సహజ నవరత్న కాఞ్చన వేదికలు గణ్టి ।
రహి వహిఞ్చిన గోపురములవె కణ్టి ॥

పావనమ్బైన పాపవినాశము గణ్టి ।
కైవశమ్బగు గగన గఙ్గ గణ్టి ।
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగణ్టి ।
కోవిదులు గొనియాడు కోనేరి గణ్టి ॥

పరమ యోగీన్ద్రులకు భావగోచరమైన ।
సరిలేని పాదామ్బుజముల గణ్టి ।
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గణ్టి ।
తిరు వేఙ్కటాచలాధిపు జూడగణ్టి ॥




Browse Related Categories: