View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కామధేనువిదే

కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥

హరినామజపమే ఆభరణమ్బులు
పరమాత్మునినుతి పరిమళము ।
దరణిదరు పాదసేవే భోగము
పరమమ్బెరిగిన ప్రపన్నులకు ॥

దేవుని ధ్యానము దివ్యాన్నమ్బులు
శ్రీవిభు భక్తే జీవనము ।
ఆవిష్ణు కైఙ్కర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ॥

యేపున శ్రీవేఙ్కటేశుడే సర్వము
దాపై యితని వన్దనమే విధి ।
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥




Browse Related Categories: