PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది ||
జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధి |
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే ||
శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన |
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే ||
నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా |
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే ||

