View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన కలిగెనిదె నాకు

కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది ॥

జయపురుషోత్తమ జయ పీతామ్బర
జయజయ కరుణాజలనిధి ।
దయ యెఱఙ్గ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥

శరణము గోవిన్ద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన ।
పరమ మెఱఙ్గను భక్తి యెఱఙ్గను
నిరతము నాగతి నీదాస్యమే ॥

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుణ్డరీకనయనా ।
అమిత శ్రీవేఙ్కటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయిఙ్కర్యమే ॥




Browse Related Categories: