View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానన్ద

జో అచ్యుతానన్ద జోజో ముకున్దా
రావె పరమానన్ద రామ గోవిన్దా ॥

అఙ్గజుని గన్న మా యన్న యిటు రారా
బఙ్గారు గిన్నెలో పాలు పోసేరా ।
దొఙ్గ నీవని సతులు గొఙ్కుచున్నారా
ముఙ్గిట నాడరా మోహనాకార ॥

గోవర్ధనమ్బెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ॥

నన్దు నిణ్టను జేరి నయము మీఱఙ్గ
చన్ద్రవదనలు నీకు సేవ చేయఙ్గ ।
నన్దముగ వారిణ్డ్ల నాడుచుణ్డఙ్గ
మన్దలకు దొఙ్గ మా ముద్దురఙ్గ ॥

పాలవారాశిలో పవళిఞ్చినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు ।
మేలుగా వసుదేవు కుదయిఞ్చినావు
బాలుడై యుణ్డి గోపాలుడైనావు ॥

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే ।
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొఙ్గ కొట్టుమన్నాడే ॥

గొల్లవారిణ్డ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుణ్డలను నేయి ।
చెల్లునా మగనాణ్డ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥

రేపల్లె సతులెల్ల గోపమ్బుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిణ్డ్ల లోను ।
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమన్దుమమ్మ ॥

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపిఞ్చి సతిపతులబట్టి ।
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాణ్డ్ర చేపట్టి మదనుడై నట్టి ॥

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెణ్డు ధరణి వ్రాల్చితివి ॥

హఙ్గుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృఙ్గార రచనగా చెప్పె నీ జోల ।
సఙ్గతిగ సకల సమ్పదల నీవేళ
మఙ్గళము తిరుపట్ల మదనగోపాల ॥




Browse Related Categories: