Telugu

Annamayya Keerthanas Jaya Lakshmi Vara Lakshmi – Telugu

0 Comments 12 June 2011

View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali

This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with appropriate anuswaras marked.

PDFLarge PDFAudio/Video

రాగం: లలిత

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి |
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా ||

పాలజలనిధిలోని పసనైనమీఁగడ
మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ||

చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా‌ఇంటనే వుండవమ్మా ||

పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురుఁబోడి |
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ||

Join on Facebook, Twitter

Browse by Popular Topics