అన్నమయ్య కీర్తన జయ జయ రామా
జయ జయ రామా సమరవిజయ రామా । భయహర నిజభక్తపారీణ రామా ॥
జలధిబన్ధిఞ్చిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా । అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ॥
అరిరావణాన్తక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదణ్డరామా । ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా ॥
అతిప్రతాపముల మాయామృగాన్తక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా । వితతమహిమలశ్రీవేఙ్కటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా ॥
Browse Related Categories: