View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు

రాగం: దేవగాన్ధారి

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిణ్డ బాలు వోయరే ॥

గామిడై పారితెఞ్చి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి ।
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥

ముచ్చువలె వచ్చి తన ముఙ్గ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి ।
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడిఞ్చరే ॥

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుఙ్గరాల చేయి పెట్టి ।
అప్పడైన వేఙ్కటాద్రి అసవాలకుడు గాన
తప్పకుణ్డ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ॥




Browse Related Categories: