View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన ఇప్పుడిటు కలగన్టి

రాగం: భూపాళం

ఇప్పుడిటు కలగణ్టి నెల్లలోకములకు ।
అప్పడగు తిరువేఙ్కటాద్రీశు గణ్టి ॥

అతిశయమ్బైన శేషాద్రిశిఖరము గణ్టి ।
ప్రతిలేని గోపుర ప్రభలు గణ్టి ।
శతకోటి సూర్య తేజములు వెలుగగ గణ్టి ।
చతురాస్యు బొడగణ్టి చయ్యన మేల్కొణ్టి ॥

కనకరత్న కవాట కాన్తు లిరుగడగణ్టి ।
ఘనమైన దీపసఙ్ఘములు గణ్టి ।
అనుపమ మణీమయమ్మగు కిరీటము గణ్టి ।
కనకామ్బరము గణ్టి గ్రక్కన మేల్కొణ్టి ॥

అరుదైన శఙ్ఖ చక్రాదు లిరుగడ గణ్టి ।
సరిలేని యభయ హస్తము గణ్టి ।
తిరువేఙ్కటాచలాధిపుని జూడగ గణ్టి ।
హరి గణ్టి గురు గణ్టి నన్తట మేల్కణ్టి ॥




Browse Related Categories: