View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన గోవిన్దాశ్రిత గోకులబృన్దా

గోవిన్దాశ్రిత గోకులబృన్దా ।
పావన జయజయ పరమానన్ద ॥

జగదభిరామ సహస్రనామ ।
సుగుణధామ సంస్తుతనామ ।
గగనశ్యామ ఘనరిపు భీమ ।
అగణిత రఘువంశామ్బుధి సోమ ॥

జననుత చరణా శరణ్యు శరణా ।
దనుజ హరణ లలిత స్వరణా ।
అనఘ చరణాయత భూభరణా ।
దినకర సన్నిభ దివ్యాభరణా ॥

గరుడ తురఙ్గా కారోత్తుఙ్గా ।
శరధి భఙ్గా ఫణి శయనాఙ్గా ।
కరుణాపాఙ్గా కమల సఙ్గా ।
వర శ్రీ వేఙ్కట గిరిపతి రఙ్గా ॥




Browse Related Categories: