PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ||
అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు
గుడుగుకొననే పట్టె గలకాలము |
ఒడలికి జీవుని కొడయడైనహరి
దడవగా గొంతయు బొద్దులేదు ||
కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము |
తలపోసి తనపాలి దైవమైన హరి
దలచగా గొంతయు బొద్దులేదు |
శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె
గరిమల గపటాల గలకాలము |
తిరువేంకటగిరి దేవుడైనహరి
దరిచేరా గొంతయు బొద్దులేదు ||

