View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన చూడరమ్మ సతులారా

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ ।
కూడున్నది పతి చూడి కుడుత నాఞ్చారి ॥

శ్రీమహాలక్ష్మియట సిఙ్గారాలకే మరుదు ।
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు ।
సోముని తోబుట్టువట సొమ్పుకళలకేమరుదు ।
కోమలాఙ్గి ఈ చూడి కుడుత నాఞ్చారి ॥

కలశాబ్ధి కూతురట గమ్భీరలకే మరుదు ।
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు ।
జలజనివాసినియట చల్లదనమేమరుదు ।
కొలదిమీర ఈ చూడి కుడుత నాఞ్చారి ॥

అమరవన్దితయట అట్టీ మహిమ ఏమరుదు ।
అమృతము చుట్టమట ఆనన్దాలకేమరుదు ।
తమితో శ్రీవేఙ్కటేశు దానె వచ్చి పెణ్డ్లాడె ।
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాఞ్చారి ॥




Browse Related Categories: