చన్దమామ రావో జాబిల్లి రావో
కున్దనపు పైడి కోర వెన్న పాలు తేవో ॥
నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టిఞ్చిన తణ్డ్రికి
నిగమము లన్దుణ్డే యప్పకు మా నీల వర్ణునికి ।
జగమెల్ల నేలిన స్వామికి ఇన్దిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి ॥
తెలిదమ్మి కన్నుల మేటికి మఞ్చి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు ।
కుల ముద్ధిఞ్చిన పట్టెకు మఞ్చి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిణ్డు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు ॥
సురల గాచిన దేవరకు చుఞ్చు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి ।
విరుల విణ్టి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమిఞ్చు నెరవాది జాణకు మా శ్రీ వేఙ్కటేశ్వరునికి ॥