View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి

రాగం: పాడి
చక్కని తల్లికి చాఙ్గుభళా తన
చక్కెర మోవికి చాఙ్గుభళా ॥

కులికెడి మురిపెపు కుమ్మరిమ్పు తన
సళుపు జూపులకు చాఙ్గుభళా ।
పలుకుల సొమ్పుల బతితో గసరెడి
చలముల యలుకకు చాఙ్గుభళా ॥

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాఙ్గుభళా ।
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాఙ్గుభళా ॥

జన్దెపు ముత్యపు సరులహారముల
చన్దన గన్ధికి చాఙ్గుభళా ।
విన్దయి వెఙ్కట విభుబెన చినతన
సన్ది దణ్డలకు చాఙ్గుభళా ॥




Browse Related Categories: