View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన భావము లోన

రాగం: దేసాక్షి

భావములోనా బాహ్యమునన్దును ।
గోవిన్ద గోవిన్దయని కొలువవో మనసా ॥

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాణ్డమ్బులు ।
హరి నామములే అన్ని మన్త్రములు
హరి హరి హరి హరి యనవో మనసా ॥

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదమ్బులు ।
విష్ణుడొక్కడే విశ్వాన్తరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥

అచ్యుతుడితడే ఆదియు నన్త్యము
అచ్యుతుడే యసురాన్తకుడు ।
అచ్యుతుడు శ్రీవేఙ్కటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ॥




Browse Related Categories: