అన్నమయ్య కీర్తన అతి దుష్టుడ నే నలుసుడను
అతిదుష్టుడ నే నలసుడను । యితరవివేకం బికనేల ॥
ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు । గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది ॥
ఘోరపుబాపము కోట్లసఙ్ఖ్యలు చేరువ నివె నాచేసినివి । నీరసునకు నిటు నీకృప నాకిక కూరిమి నా యెడ గుణమేది ॥
యెఱిగి చేసినది యెఱుగక చేసిన- కొఱతలు నాయెడ గోటులివే । వెఱపు దీర్చి శ్రీవేఙ్కటేశ కావు మఱవక నాగతి మఱి యేది ॥
Browse Related Categories: