అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి
రాగం: శివ రంజని
అంతర్యామి అలసితి సొలసితి । ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥
కోరిన కోర్కులు కోయని కట్లు । తీరవు నీవవి తెంచక । భారపు బగ్గాలు పాప పుణ్యములు । నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥
జనుల సంగముల జక్క రోగములు । విను విడువవు నీవు విడిపించక । వినయపు దైన్యము విడువని కర్మము । చనదది నీవిటు శాంతపరచక ॥
మదిలో చింతలు మైలలు మణుగులు । వదలవు నీవవి వద్దనక । ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె । అదన గాచితివి అట్టిట్టనక ॥
Browse Related Categories: