View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన అన్తర్యామి అలసితి

రాగం: శివ రఞ్జని

అన్తర్యామి అలసితి సొలసితి ।
ఇన్తట నీ శరణిదె జొచ్చితిని ॥

కోరిన కోర్కులు కోయని కట్లు ।
తీరవు నీవవి తెఞ్చక ।
భారపు బగ్గాలు పాప పుణ్యములు ।
నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥

జనుల సఙ్గముల జక్క రోగములు ।
విను విడువవు నీవు విడిపిఞ్చక ।
వినయపు దైన్యము విడువని కర్మము ।
చనదది నీవిటు శాన్తపరచక ॥

మదిలో చిన్తలు మైలలు మణుగులు ।
వదలవు నీవవి వద్దనక ।
ఎదుటనె శ్రీ వెఙ్కటేశ్వర నీవదె ।
అదన గాచితివి అట్టిట్టనక ॥




Browse Related Categories: