అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మఙ్గ నాఞ్చారమ్మ ।
తమ్మియిణ్ట నలరుకొమ్మ ఓయమ్మ ॥
నీరిలోన తల్లడిఞ్చే నీకే తలవఞ్చీ
నీరికిన్ద పులకిఞ్చీ నీరమణుణ్డు ।
గోరికొన చెమరిఞ్చీ కోపమే పచరిఞ్చీ
సారెకు నీయలుక ఇట్టె చాలిఞ్చవమ్మ ॥
నీకుగానే చెయ్యిచాచీ నిణ్డాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెఞ్చీని ।
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ॥
చక్కదనములె పెఞ్చీ సకలము గాలదఞ్చి
నిక్కపు వేఙ్కటేశుడు నీకే పొఞ్చీని ।
మక్కువతో అలమేల్మఙ్గ నాఞ్చారమ్మ
అక్కున నాతని నిట్టే అలరిఞ్చవమ్మ ॥