View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన అలరులు కురియగ

రాగమ్: ధీర శఙ్కరాభరణం

అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమఙ్గ ॥

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే ।
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగిమ్పుచు నలమేలుమఙ్గ ॥

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే ।
పెట్టిన వజ్రపు పెణ్డెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమఙ్గ ॥

చిన్దుల పాటల శిరిపొలయాటల
అన్దెల మ్రోతల నాడె నదే ।
కన్దువ తిరువెఙ్కటపతి మెచ్చగ
అన్దపు తిరుపుల నలమేలుమఙ్గ ॥




Browse Related Categories: