View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ॥

అదె వేఙ్కటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము ।
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానన్దమయము ॥

చెఙ్గట నదివో శేషాచలమూ
నిఙ్గి నున్న దేవతల నిజవాసము ।
ముఙ్గిట నల్లదివో మూలనున్న ధనము
బఙ్గారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥

కైవల్య పదము వేఙ్కట నగ మదివో
శ్రీ వేఙ్కటపతికి సిరులైనది ।
భావిమ్ప సకల సమ్పద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ॥




Browse Related Categories: