Back

త్యాగరాజ పంచరత్న కీర్తన కన కన రుచిరా

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: వరాళి
తాళం: ఆది

కన కన రుచిరా
కనక వసన నిన్ను

దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను
కన కన రుచిర కనక వసన నిన్ను

పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ
కన కన రుచిరా కనక వసన నిన్ను

సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు
కన కన రుచిరా కనక వసన నిన్ను

మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘ్పతే
కన కన రుచిరా కనక వసన నిన్ను

కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే
కన కన రుచిరా కనక వసన నిన్ను

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా

PDF, Full Site (with more options)