Back

అన్నమయ్య కీర్తన తిరువీధుల ంఎఱసీ

తిరువీథుల ంఎఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ||

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ||

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ||
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుRRఅంఎనిమిదోనాడు ||

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్^మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ||

PDF, Full Site (with more options)