Back

అన్నమయ్య కీర్తన తందనానా అహి

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||

బ్రహ్మ ంఒకటే, పర
బ్రహ్మ ంఒకటే, పర
బ్రహ్మ ంఒకటే, పర
బ్రహ్మ ంఒకటే ||

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే |
ంఎండైన బ్రాహ్మణుడు ంఎట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||

అనుగు దేవతలకును అల కామ సుఖ ంఒకటే
ఘ్న కీట పశువులకు కామ సుఖ ంఒకటే |
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ ంఒకటే ||

PDF, Full Site (with more options)