Back

అన్నమయ్య కీర్తన రాముడు లోకాభిరాముడు

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే ||

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే |
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే ||

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే |
శూరుడు ధర్మవిచారుడు రఘ్వంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే ||

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే |
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే ||

PDF, Full Site (with more options)