Back

అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ

మేదిని జీవుల గావ మేలుకోవయ్యా |
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ||

తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా |
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ||

ఘ్నదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా |
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ||

వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
ంఎరయుదోషరహిత మేలుకోవయ్యా |
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ||

PDF, Full Site (with more options)